వాల్ నట్స్, సోయాబీన్ తో డయాబెటీస్ కు చెక్:
ప్రస్తుతం డయాబెటీస్ సమస్య అందరినీ వేధిస్తోంది. అన్ని రకాల వయస్సు వారు మధుమేహం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం డయాబెటీస్ కు దారి తీస్తోంది. అయితే అమెరికాకు చెందిన టఫ్ట్స్ యూనివర్సిటీ తాజాగా జరిపిన పరిశోధనల్లో వాల్ నట్స్, సోయాబీన్స్ తరచూ తీసుకుంటే డయాబెటీస్ దూరమవుతోందని తేలింది. ఈ విషయాన్ని ఆ యూనివర్సిటీ పీఎల్ఓఎస్ మెడికల్ జర్నల్ లో వెల్లడించింది.