యోగాసనాలు ఆరోగ్య రక్షణ

సూర్యనమస్కారములు

అజ్ఞానమనే చీకట్లను తొలగిస్తూ మానవాళికి విజ్ఞానమనే వెలుగును ప్రసాదించే సూర్యభగవానుని ప్రభావం అతీతమైనది….. అనంతమైనది. రాతియుగం నుండి, యుగం వరకూ మనిషిలో ఎంతో విజ్ఞానాన్ని నింపుతోంది సూర్యశక్తి రాకెట్

సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు మానవశరీరాన్ని తాకడం వలన ఎన్నో రకాలైన వ్యాధులు దరిజేరకుండా వుంటాయనే ఎన్నో విషయాలు, శాస్త్ర ప్రామాణికమయ్యాయి.

పతంజలి యోగశాస్త్రంలో సూర్యనమస్కారముల వలన ఎన్నో ఆరోగ్యవిషయాలకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది.

ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, సూర్యోదయ ఆరంభం నుండి సూర్యనమస్కార విధానాలను ప్రారంభించాలి. సూర్యనమస్కార ఆసనాలను ఆరుబయట కొంచెం ఎత్తైన ప్రదేశంలో సూర్యోదయానికి అభిముఖంగా వుండి చేయాలి. ఈ ఆసనాలు చేస్తున్నపుడు

సూర్యుని పన్నెండు నామాలను పారాయణం చేయడం ప్రధానం.

1. ఓం మిత్రాయ నమః

2. ఓం రవయే నమః

3. ఓం సూర్యాయ నమః

4. ఓం భావనే నమః ”

5. ఓం ఖగాయ నమః

6. ఓం పూస్టై నమః

7. ఓం హిరణ్య గర్భాయనమః

8. ఓం మరీచాయ నమః

9. ఓం ఆదిత్యాయ నమః

10. ఓం సవిత్రే నమః

11. ఓం ఆర్కాయ నమః

12. ఓం భాస్కరాయ నమః |

నేల మీద నించుని, రెండు పాదాలు బాగా దగ్గరగా ఆనుకునేట్లు కాళ్ళను దగ్గరకు చేర్చాలి. కాళ్ళనుండి తల వరకూ శరీరాన్ని నిటారుగా వుంచాలి. శ్వాసను బాగా తీసుకుంటూ రెండు చేతులనూ జోడించి, ఛాతికి మధ్యభాగంలో బొటనవేళ్ళూ అనుకునేలా నమస్కారముద్ర వేయాలి. వీలయినంత ఎకలను రేపు నను కంటించి మంచి నిదానంగా వదలాలి.