త్రాగే నీరు - ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్య చిట్కాలు మనిషికి కావలసిన అత్యంత ప్రధాన వనరులలో ముఖ్యమైనది నీరు, త్రాగే నీరు విషయంలో అత్యంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. త్రాగేనీరు TEST చేయడానికి రెండు రకాల TESTS ఉన్నాయి వాటిలో
H TEST
S. TESTE
P.H TEST నీటి యొక్క పిహెచ్ విలువ 7, కాబట్టి పిహెచ్ 6.5-85 ఉన్నా నీరు త్రాగడానికి అనుకూలం. పిహెచ్ 9 కన్నా ఎక్కువ ఉన్న నీరు యొక్క అలైన్ స్వభావం పెరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి ఈ టెస్ట్ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
చాలామంది పాతరోజులలో చెరువులలో, బావులలో, పంపులలో నీరు త్రాగేవాళ్ళం కదా, అప్పుడు ఈ టెస్ట్లు
చేయలేదు కదా అని అంటారు. నిజమే కానీ ప్రకృతి, పరిసరాలు ఈ రోజులలో ఎంత కలుషితం అయ్యాయో అనే
విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సగంపైనా శారీరక రోగాలకు కారణం కలుషితమైన నీరు త్రాగడం వల్ల అని మరచిపోవద్దు.
TD.S. TEST. 400 రూపాయలకు ఈ పరికరం ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యమౌతుంది. త్రాగేనీరు యొక్క టి.డి.యస్, కనీసం 100 పి.పి.యం నుండి అత్యధికంగా 500 పి.పి.యం. వరకు ఉండవచ్చు. గమనించినట్లయితే 20 లీటర్ల వాటర్ క్యాన్లలో ఉండే నీటి యొక్క టి.డి.యస్. 50 ఏ.పి.యం, కన్నా తక్కువ ఉంటోంది చాలావరకు ఇది గమనించాల్సిన విషయం.
ఆహారం ఆరోగ్య చిట్కాలు:
పాలు త్రాగటం ఆరోగ్యకరమైన అలవాటే కానీ, కచ్చితంగా పాలు త్రాగాలని నియమచేదిలేదు. ఎందుకంటే తెల్ల నువ్వులలో కూడా పాలులో ఉన్న కానా ఎక్కువ క్యాల్షియం దొరుకుతుంది. కాబట్టి పాల మీద మనకున్న అవగాహనలో మార్పు రావాలి.
వేడిగా ఉండే పదార్ధాలనే కచ్చితంగా తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆకు కూరలను పిల్లలు, పెద్దలు పెద్దగా తినడానికి ఇష్టపడరు. కానీ, వారానికి కనీసం మూడు సార్లు ఆకు కూరలు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర చాలా చాలా మంచిది. ఈ అలవాటును ఇప్పుడు మనం మన పిల్లలకు నేర్పకపోతే భవిష్యత్తులో వాళ్ళ పూర్తిగా ఆకు కూరలను మర్చిపోయే ప్రమాదం ఉంది.
పిల్లలకు ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు మొదలైనవాటిని పెట్టడం చాలా చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా ఈ స్నాక్స్ వారి ఆహారంలో ఉండేట్లు చూచవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
1 వారానికి మూర లేదా నాలుగు సార్లు లెల్ల నువ్వుల ఉండ, వేరుశనగ ఉండ, సున్నుండ (బెల్లంతో చేసినవి) ఖచ్చితంగా పెట్టాలి.
వారానికి రెండు లేదా మూడు సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్నిరకాల పండ్లను స్నాక్స్ పెట్టవచ్చు.
1 వారానికి రెండు లేదా మూడుసార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తావు లాంటివి కూడా ఖచ్చితంగా స్నాక్స్ గా పెట్టాలి.
ఆహారం చేయకూడనివి:
ప్యాకేజ్ ఫుడ్ అన్ని ఆపేయాలి. నూడిల్స్, కుంకురే, లేస్, బింగో, ప్యాకేళ్ల స్వీట్స్ మొదలైన అన్నిటికి పిల్లలను దూరంగా ఉంచాలి. వీటిలో ప్రిజర్వటీస్గా కలిపే రసాయనాలు చాలా హానికరం.
నూనెలతో చేసే అన్ని పదాల ఉదాహరణకు పునుగులు, బజ్జీలు సమాసాలు మొదలైన వాటి పిల్లలను శాశ్వతంగా దూరంగా ఉంచండి, మసాలాలు, వేపుడు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచండి.
మామూలుగా పిల్లల విషయంలో చెక్కర వాడకం విషయంలో జాగ్రత్త మన ఆహార పదార్ధాల తయారీలో చెక్కర వాడకాన్ని తగ్గించాలి
చాలామందికి అనుమానం రావచ్చు. ఇవన్నీ చదివిన తరువాత తినటానికి ఏమి మిగిలిందని, ఇది తప్పు ఇవిగాక ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటి ఆహార పదార్ధాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి మనకు ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడని.
ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఒక మనిషి తన జీవిత కాలంలో తీసుకోవాల్సిన ఆహారం కన్నా రెండు లేక మూడు రెట్లు తీసుకొంటున్నారని కధనం కాబట్టి మితాహారం ఆరోగ్యకరం
పెద్దలు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు:
ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పును తినటం చాలా మంచిది,
ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి,
ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.
ఉప్పు వినియోగం గణనీయంగా తగ్గాలి. వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.
టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫంక్షన్స్ కి , వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటిని
ఎంచుకొని మరీ తినాలి. సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది.
కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు
ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.
నీరు త్రాగటం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నా
గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు, గంట తరువాత ఒక లీటరు ఖచ్చితంగా త్రాగండి.
రాత్రి 7.00 గంటల లోపు లేదా ఖచ్చితంగా 8.00 గంటల లోపు ఆహారం తీసుకోండి. తిన్న తరువాత కనీసం ఒక అరగంట అయిన కచ్చితంగా నడవండి
అల్పాహారం ఆరోగ్య చిట్కాలు:
ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటి బదులు జొన్నలు, మినుములుతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి.
దోశలను నెయ్యితో కాల్చుకోండి నూనెను పూర్తిగా దూరం చేయండి.
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు చాలా మంచి ఆహారం.
మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం.
పూరీలు, మైసూర్ బోండా మొదలైన టువంటిది నెలకు ఒక్కసారి అయితే పరవలేడు. వీలైతే వాటి సంచి పర్తిగా దూరంగా ఉండండి
వారానికి ఒకటి లేదా రెండు సార్ల వరకు చపాతీని నెయ్యితో కాల్చుకొని తినటం కూడా చెక్కవచ్చు.
మధ్యాహ్న భోజనం ఆరోగ్య చిట్కాలు
పాలిష్ బియ్యానికి పూర్తిగా దూరమవ్వాలని. వేరే మార్గం లేదు. దీని విషయంలో మరొక ఆలోచన కూడా అనవసరం.
బియ్యానికి దూరం కాయలేకపోతే మిగిలిన ఏకైక మార్గం ముడి బియ్యం అని గుర్తుంచుకోవాలి. తృణధాన్యాలు మంచి బలవర్ధక ఆహా
రాగి సంగటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి అన్యంత ఆరోగ్యకరమైన ఆహారం. కొర్రలు ప్రపంచస్థాయిని ఆకర్షించే అత్యంత పౌష్టికాషరం
మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. అన్నింటినీ నూనెలు లేకుండా చక్కగా వండుకొని తినవచ్చు.
ఖచ్చితంగా వారానికి మూడు రోజులపాటు ఆకు కూరలు వండవలసినదే. దీనిని ఖచ్చితంగా పాటించండి
రాత్రి భోజనం ఆరోగ్య చిట్కాలు
ఖచ్చితంగా 7.00 లేదా 8.00 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్ణయ్యలాగా చూసుకోండి,
రాత్రికి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకొనటం అత్యంత ఆరోగ్యకరం.
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్చీ ఆ పేస్టును కాలిన గాయాల పై రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
శరీరం పై కాలిన చోట పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్ళల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ వుండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు.
ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి వచ్చినా తల తిరిగినట్లుగా ఉన్నా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ముక్కు దిబ్బెడ వేసినప్పుడు ఒక చుక్క ఉల్లిరసాన్ని నాసికా రంధ్రాల్లో వేస్తే ఉపశమనం కలుగుతుంది.
మతిమరపు ఉన్నవారు తేనెను వాడాలి. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
సగానికి కోసిన నిమ్మచెక్క పై ఉప్పు, మిరియాల పొడి చల్లి సౌ మీద కొద్దిగా వేడి చేసి రసం పిండుకొని త్రాగితే మైగ్రెయిన్ తలనొప్పి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం, తేనె, గ్లిసరిన్ సమపాళ్ళలో కలిపి తడవకు చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
ఆరోగ్య చిట్కాలు
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి అక్కడ ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి.
ఆరు వంతుల నారింజ రసానికి, ఒక వంతు కారెట్ రసం, ఒక వంతు నిమ్మరసం చేర్చి, ఆ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు సగం కప్ప త్రాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుసు ఉంటారు. సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని పిలలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇసుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది.
ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గుతుంది.
కారట్ రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి భోజనానికి ముందు ఒక కపు తాగితే ముక్కు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చను.
కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి
బచ్చలి రసం, అనాసరసం సమపాళ్లలో తీసుకుని కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
బచ్చలి, కారట్ రసాలు సమపాళ్లలో కలిపి రోజుకు మూడు సార్లు సగం కప్ప చొప్పున తాగితే రోజంతా శక్తి, ఉత్సాహంతో ఉంటారు.
తేనెటీగ, కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
అరికాళ్లు విపరీతంగా మంటపుడుతుంటే గోరింటాకు గానీ, నెయ్యి గాని, సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతు నొప్పి,దగ్గు వెంటనే తగ్గుతాయి.
పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరిస్తే కొంత పంటినొప్పి తగ్గుతుంది.
మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి?
వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.
తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. వీలయినంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి.
వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర క్రింద భాగాన కుళాయి ఏర్పాటు చేసుకుంటే మంచిది. శుభ్రంగా ఉంటుంది.
ఆహార పదార్థాల పైన ఈగలు, క్రిమికీటకాదులు వాలకుండా ఎకోవాలి. కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.
రకరకాల తలనొప్పులకు ఓ దివ్య చిట్కా గవ్వల్ని నిమ్మరసంలో మునిగేలా 10 రోజులుంచితే అవి కరిగిపోతాయి. ఆ రసాన్ని తలకి పట్టిస్తే చాలు తలనొప్పి పోతుంది. జుత్తు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
రక్తంలోని కొలెస్టరాల్ ను తగ్గించుకొని సన్నబడాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి.
రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పది హేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వనొప్పి తగ్గుతుంది.
చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది.
దగ్గు, ఆయాసంతో బాధపడేవారు అల్లం రసం 1 స్పూన్, దానిమ్మరసం 1 స్పూన్, తేనె 1 స్పూన్ ఈ మూడూ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగూ, ఆయాసం బాగా తగ్గుతాయి.
చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే మలబద్దకం పోతుంది,
అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజ నాలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
మూత్ర విసర్జనలో బాధగా లేదా మంటగా ఉంటే క్యాబేజీని మాత్రం అసలు తినకూడదు.
చేమంతిపూలు ఆరోగ్య చిట్కాలు
చేమంతిపూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయి.
చేమంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి, ఒంటిపై దురదలున్న చోట రాస్తే తగ్గుతుంది. దురదలు వెంటనే తగ్గుతాయి. నోటిపూత వుంటే నోట్లో లోపల రాస్తే పూత
కాలి కండరం పట్టినట్లు మనకనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి.
చేమంతి ఆకులను నేతితో వెచ్చచేసి, నుదుట పై, కణతల మీద వేసి కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయి.
దోమ కుట్టిన దద్దుర్లు, దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ ముక్కతో రుద్దండి.
చేమంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం, సాయంత్రం ఒక ఔన్సు తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది.
గవద బిళ్ళలు వస్తే అవిసె ఆకురసం రాస్తే త్వరగా తగ్గుతాయి.
చేమంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలు కడిగితే వెంటనే మాయమౌతాయి.
ఒక్కొక్కసారి పొత్తి కడుపులో బిగబట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయా వేడినీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకుని తాగండి. నొప్పి తగ్గుతుంది.
చేమంతి పూల రసాన్ని తేలు, జెర్రి మొదలైన క్రిములు కుట్టిన చోట రాసి గుడ్డపొగ వేస్తే, విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుంది
మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త
వైద్యుడి అవసరం అందరికీ కలుగుతుంది. కొన్ని రకాల జబ్బులకు ఇంతకు ముందు కలిగిన అనారోగ్యపు లక్షణాలు, అప్పుడు జరిగిన వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటే వైద్యుడు మెరుగైన చికిత్స చేయగలుగుతాడు.
అందుకే ఇంటిలోని పిల్లల పెద్దల మెడికల్ రిపోర్ట్స్ ని జాగ్రత్త చేసే బాధ్యతని గృహిణి తీసుకోవాలి. ఎక్సరేలు, క్లినికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ స్లిప్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దాచాలి.
ఇంట్లోని వారి రక్తం ఏ గ్రూపుకు చెందిందో పరీక్ష చేయించి, ఆ వివరాన్ని జాగ్రత్త చేయాలి. చిన్నతనంలో పిల్లలకు వచ్చిన జబ్బులు, వాటికి తీసుకున్న చికిత్స, టీకాలు వేయించిన తేదీల వంటి సమాచారం వుండటం అవసరం.
మెడికల్ రిపోర్ట్స్ ని కవర్లో పెట్టి దానిమీద వివరం రాసి పెట్టుకోవడం లేదా ఫైల్ చేయడం లేదా పాలిథిన్ కవర్స్ లో పెట్టటం మంచిది. ఇవైతే లోపలి కాగితాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఏ కాగితం అవసరమో దానిని మాత్రమే తీసుకోవచ్చు
సుఖనిద్ర ఎలా మీకు లభిస్తుంది ?
ఆహారం లేకపోయినా మానవుడు మనుగడ సాధించగలడు. కానీ కనీస నిద్ర లేకపోతే జీవించలేడు, అంతేకాదు మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆనందానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక రోజుకు కనీసం 6 గంటలు నిద్ర తప్పక పోవాలి.
వేడి చేసి చల్లార్చిన ఆలీవ్ ఆయిలని అర చేతులకు రుద్ది కాసేపటి తరువాత కాటన్ గ్లోవ్స్ ధరించి నిద్రకుపక్రమిస్తే ఫలితం కనిపిస్తుంది.
మారేడు కషాయం రెండు మూడు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముసాల వరుకు మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్దతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మీ
ఒక విధమైన ప్రశాంతత చోటు చేసుకుని క్రమంగా నిద్ర వస్తుంది.
ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్ర పడుతుంది.
సంపూర్ణ ఆహార విలువలు
ఉదయం 6 గంటలకు 1 గ్లాసు పాలు లేదా రాగి జావ
8 గంటలకు 4 ఇడ్లీ లేదా సమానమైనటువంటి టిఫిన్
10 గంటలకు 1 గ్లాసు పండ్లరసం లేదా పండ్లు.
మధ్యాహ్నం 12 గంటలకు 2 కప్పుల అన్నం, 1 కప్ప ఆకుకూర పప్పు, 1 కప్పు
కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు
4 గంటలకు 1 కప్పు టీ, స్నాక్స్ లేదా మొలకెత్తిన శెనగలు పెసలు లాంటివి
8 గంటలకు 2 చపాతీలు, కప్పు అన్నం, కప్పు కూర, రసం.
10 గంటలకు 1 గ్లాసు పాలు
పైన పేర్కొన్న విధంగా ఆహారం తీసుకుంటే మీకు సంపూర్ణ ఆహారం లభించినట్లే,
వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి.
చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి
జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి అరస్పూను పడి, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి.
ద్రవ పదార్థాలు మజ్జిగ, నీరు, పండ్లరసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా వడదెబ్బ నివారించబడుతుంది.
అన్న ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే
బ్యాక్టీరియాతో పోరాడే అల్లం.
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి అల్లం మన శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇనెఫెక్షన్లను తగ్గించడంలో అల్లం సాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం అల్లం అనేక బ్యాక్టీరియాలతో పోరాడగలదని సూచిస్తున్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
వైరస్‌ని దూరం చేసే వెల్లుల్లి.
ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. ఇది కూరలకు రుచిని మాత్రమే కాదు. అనేక ఆరోగ్యప్రయోజనాలతో నిండి ఉంది . వెల్లుల్లి వివిధ వ్యాధుల నివారణకు, చికిత్స ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా సంక్రమణతో పోరాడటానికి ఒక ప్రభావవంతమైన ఔషధంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియాను, వైరల్‌ను, ఫంగల్, ఈస్ట్, వార్మ్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది .
కొత్తిమీర.
కొత్తిమీర కూరలకు మంచి రుచి ఇస్తుంది. కొత్తిమీరని కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కొత్తిమీర కూరకి రుచి మాత్రమే కాదు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు, విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీర బరువుని తగ్గించేందుకు, చర్మ సౌందర్యానికి, మధుమేహం తగ్గించడానికి, కంటి చూపు మెరుగుపరచడానికి సాయపడుతుంది.
మీ ఇంట్టో గాలిని శుభ్రపరిచే ఇంట్లో పెరిగే మొక్కలు.
కొన్ని మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చటమే కాదు. గాలిలోని మలినాలను విషవాయువులను కూడా పీల్చి పరిశుభ్రం చేస్తాయి. వీటిని ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెపుతున్నారు. మీరు ఇప్పటికే ఇండోర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లయితే, తక్షణమే వీటికి మీ ఇంట్లో స్ధానం కల్పించి కాలుష్యం లేని చక్కటి గాలితో ఆరోగ్యాన్ని పొందండి.
ఈ క్రింది మొక్కలతో మీరు ఉండే ప్రదేశాలను అలంకరించుకుంటే మీరు పీల్చే గాలి స్వచ్చంగా ఉంటుంది.
వెదురు మొక్క చాలా గొప్పది, దాన్ని మీఇంట్లో పెంచినట్లయితే వాతావరణంలో ఉండే అన్నిరకాల రసాయనాలని తొలగిస్తుంది. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు, అందువల్ల ఇంట్లోనే నీడ ఉన్న చోట పెంచవచ్చు. ఇది కార్బన్ మోనాక్సైడ్, బెంజేన్, ఫార్మాల్డిహైడ్, గ్సైలిన్, క్లోరోఫారం వంటి వాటిని తొలగిస్తుంది, వీటిని లాండ్రీ రూమ్, లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంచడం మంచిది.
భారతదేశంలో రబ్బరు చెట్లు చాలా సర్వసాధారణం. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువ వెలుగు, నీరు, ఎరువులు ఎక్కువ మోతాదులో అవసరం. ఇది కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోథైలిన్ ని తొలగించడానికి మంచి ఎంపిక.
వెదురు లాగానే పోక చెక్క మొక్క కూడా ఒకటి. దీని ఆకులు అల్లుకున్నట్లు ఉండి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. వీటి పెరుగుదలకు ఎక్కువ సూర్యకాంతి, నీరు అవసరం. ఇది బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, గ్సైలిన్, ట్రైక్లోరోథైలిన్, ఫార్మాల్డిహైడ్ ని తొలగించడమే కాకుండా గాలిని చల్లబరుస్తుంది కూడా.
అందమైన తులిప్ మొక్కలు ఇంట్లో అందంగా కనిపించడమే కాకుండా, గాలిని స్వచ్చ పరుస్తాయి. నేరుగా సూర్యకాంతి పాడనీ చోట వీటిని ఉంచి, ప్రతిరోజూ తేమగా ఉందొ లేదో అని మట్టిని పరీక్షించాలి. ఇది అమ్మోనియాను పారద్రోలుతుంది.