డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే గుండే సేఫ్
వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అవి రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
జీడిపప్పు:
గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి కాబట్టి దీనిని విరివిగా వాడండి.
బాదం :
బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.