ఈ రోగాలుంటే గ్రీన్ టీ తాగకూడదు.. లేదంటే చిక్కుల్లో పడతారు:
నార్మల్ టీ కన్నా గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరూ దాన్నే అలవాటుగా మార్చుకున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తేలడంతో మరింత మంది తాగేందుకు మగ్గు చూపుతున్నారు. కానీ గ్రీన్ టీ కొందరు తాగితే అనారోగ్యం బారిన పడడం ఖాయం. మరి గ్రీన్ టీ ఎవరెవరు తాగకూడదో ఒకసారి చదివి తెలుసుకోండి.
ఇన్సోమ్నియా :
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రులు ఎక్కువ సేపు మేల్కోవడం వల్ల నిద్ర తక్కువగా పోతున్నారు. ఇలాంటి వారు గ్రీన్ టీ అసలు తాగకూడదు. అలాగే ఇన్సోమ్నియాకు బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నవారు కూడా గ్రీన్ టీకు దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకు బదులుగా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం అంటున్నారు.
మధుమేహం :
డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు షుగర్ లేకుండా కాఫీ, టీ తాగుతుంటారు. ఇదంతా ఎందుకులే అని గ్రీన్ టీ తాగుతున్నారు. వారికి ఇది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అయినా పట్టించుకోకుండా తాగడం వల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఐరన్ సమస్య :
చాలామంది ఐరన్ సమస్యతో బాధపడుతుంటారు. ఆహారం నుంచి పొందే ఐరన్ శక్తిని గ్రీన్ టీ క్షీణించేలా చేస్తుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందదు.
గర్భిణీ మహిళలు :
పిల్లలకోసం ఎదురుచూసేవాళ్లు గ్రీన్ టీ అతిగా తాగకూడదు. అలాగే గర్భంతో ఉన్న మహిళలు గ్రీన్ టీ అసలు తాగకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చేరి జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు.
రక్తపోటు :
గ్రీన్‌టీలో ఉండే ఉత్తేజిత లక్షణం బీపీపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. రక్తపోటు సమస్య గనుక ఉంటే గ్రీన్‌టీ అసలు తాగకూడదు. వీలైనంత వరకు గ్రీన్ టీకి దూరంగా ఉండేలా చూసుకోండి.